demonitization: దిమ్మతిరిగేలా చేస్తోన్న నల్లధనం.. 20 నకిలీ ఖాతాల్లో ఏకంగా రూ.60 కోట్ల డిపాజిట్
పెద్ద నోట్ల రద్దు అనంతరం సోదాలు నిర్వహిస్తోన్న అధికారులకు తవ్విన కొద్దీ నగదు బయటపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకుల్లోని పలు బ్రాంచిల్లో ఇటీవలే సోదాలు నిర్వహించిన అధికారులు ఆ బ్యాంకులో ఎన్నో అక్రమాలు జరిగాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నకిలీ అకౌంట్లను గుర్తించిన అధికారులు అదే బ్యాంకులో మరిన్ని నకిలీ అకౌంట్లు గుర్తించారు. ఆ బ్యాంకులో నకిలీ సంస్థల పేర్లతో 20 ఖాతాలు తెరిచినట్లు గుర్తించిన అధికారులు.. ఆ ఖాతాల్లో ఏకంగా రూ.60 కోట్లు జమ అయినట్లు తెలుసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలపై అధికారులు విచారణ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో జమ అవుతున్న నగదుపై ఐటీ అధికారులు నిఘా పెడుతూ సమర్థవంతంగా నల్లకుబేరుల పని పడుతున్నారు.