peta veg couple: బాలీవుడ్ హాటెస్ట్ వెజిటేరియన్ కపుల్ గా సోనమ్, షాహిద్ కపూర్ ఎంపిక!


2016వ సంవత్సరానికి గాను హాటెస్ట్ వెజిటేరియన్ కపుల్ ను 'పెటా' ఎంపిక చేసింది. ఈ టైటిల్ కోసం పలువురు బాలీవుడ్ నటులు పోటీ పడ్డారు. అలా పోటీ పడ్డ వెజిటేరియన్ బాలీవుడ్ నటుల్లో అమితాబ్ బచ్చన్, అలియా భట్, విద్యుత్ జమ్వాల్, కంగనా రనౌత్, ఆర్.మాధవన్, సన్నీ లియోన్, సోనమ్ కపూర్, షాహిద్ కపూర్ తదితరులు ఉన్నారు. వీరిలో 2016 హాటెస్ట్ వెజిటేరియన్ కపుల్ గా సోనమ్ కపూర్, షాహిద్ కపూర్ ఎంపికైనట్టు 'పెటా' ప్రకటించింది. కాగా, జంతు పరిరక్షణకు పాటుపడుతున్న పెటా ప్రతిఏటా వెజిటేరియన్ లుగా మారాలంటూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇలా వెజిటేరియన్ సెలబ్రిటీలను ఎంపిక చేస్తుంది. 

peta veg couple
hottest veg couple
sonam-sahid
  • Loading...

More Telugu News