shabbir ali warns harishrao: మమ్మల్ని కడిగేస్తే... మేము ఉతికేస్తాం: షబ్బీర్ అలీ


ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను విమర్శించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు విపక్షాలను కడిగెయ్యాలని పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలను కడగడం సంగతి అలా ఉంచి, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కాళ్లు కడగాలని సూచించారు. అలా కాదని తమను కడుగుతామంటే...తాము మౌనంగా ఉండమని, ఉతికేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ నేతలు నిమగ్నమైతే బాగుంటుందని ఆయన సూచించారు. 

shabbir ali warns harishrao
  • Loading...

More Telugu News