chandralok complex: సికింద్రాబాదులోని చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్!


సికింద్రాబాదులోని ప్రముఖ వాణిజ్య సముదాయం చంద్రలోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నోటీసులు కూడా అతికించారు. వస్త్ర వ్యాపార కార్యాలయాలు కలిగిన చంద్రలోక్ కాంప్లెక్స్ సుదీర్ఘ కాలంగా సికింద్రాబాదులో పేరుప్రతిష్ఠలు సంపాదించుకుంది. బిల్డింగ్ కాలపరిమితి ముగిసిపోవడంతో కూలిపోయే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రలోక్ కాంప్లెక్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. అనంతరం దీనిని సీజ్ చేశారు. 

  • Loading...

More Telugu News