satyanadella: డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సదస్సుకి హాజరుకానున్న సత్య నాదెళ్ల
తమ దేశంలోని 'వలస విధానంలో సవరణలు' అంశంతో పాటు 'సామాజిక ఆందోళనలు' వంటి అనేక అంశాలపై చర్చించడానికి టాప్ టెక్ కంపెనీల సీఈవోలతో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎల్లుండి ఓ సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల కూడా హాజరుకానున్నారు. అంతర్జాతీయ వార్తా ఛానెల్ సీఎన్ఎన్ ఈ సదస్సు గురించి మరింత స్పష్టతనిస్తూ ఇందులో సత్య నాదెళ్లతో పాటు యాపిల్ సీఈవో టిమ్‌కుక్, అల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్, ఫేస్బుక్ నుంచి షెరిల్ శాండ్‌బర్గ్, ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిచ్ కూడా పాల్గొంటున్నట్లు తెలిపింది. ఈ సదస్సు కోసం ఆయా కంపెనీల సీఈవోలకు పంపిన ఆహ్వానాలపై ట్రంప్ అల్లుడు, సలహాదారు జేరెడ్ కుష్నర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రెయిన్స్ ప్రీబస్, బిలియనీర్ టెక్ ఇన్వెస్టర్ పీటర్ తియెల్ లు సంతకాలు చేశారని సీఎన్ఎన్ పేర్కొంది.