ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే

108 దివ్య తిరుపతులలో ఒకటిగా 'తిరుత్తన్ గాళ్' ఒకటి. 'శివకాశి'కి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారు  'అప్పన్' పేరుతో పిలవబడుతుండగా, అమ్మవారు అనంతనాయకి పేరుతో కొలవబడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడికి .. ఉషకి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతోంది.

తూర్పు ముఖంగా వేంచేసి వున్న ఇక్కడి స్వామివారిని తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్టు చెబుతారు. ఇక్కడ పాపవినాశన తీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడి తీర్థాన్ని శిరస్సు పై చిలకరించుకున్నా, పాపాలు పటాపంచలు అవుతాయని అంటారు. వల్లభ మహారాజుకు . శల్యపాండ్యునికి ఇక్కడి స్వామివారు ప్రత్యక్షమైనట్టు చెబుతారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా .. మహిమాన్వితమైనదిగా చెప్పబడే ఈ క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందే.        


More Bhakti News