రాయలవారు నిర్మించిన ఆలయం

ప్రాచీన క్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు .. శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే గోపురాలను .. మంటపాలను .. ప్రాకారాలను చూస్తున్నప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అవి ఎవరి కాలంలో నిర్మించబడ్డాయో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అలాంటప్పుడు ఎక్కువగా కృష్ణదేవరాయల పేరు వినిపిస్తుంది. ఆయన ఎన్నో ఆలయాలను నిర్మించాడు .. మరెన్నో ఆలయాలను పునరుద్ధరించాడు.

అలాంటి క్షేత్రాలలో ఒకటిగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 'శ్రీరంగాపురం' కనిపిస్తుంది. స్వయంభువుగా చెప్పబడే ఇక్కడి రంగనాయకస్వామి వారి మూర్తిని చూసితీరవలసిందే. రాయలవారి స్వప్నంలో స్వామి కనిపించి, తన జాడ తెలియజేయగా ఆయన వెలికి తీయించాడని చరిత్ర చెబుతోంది. రాయలవారు దగ్గరుండి స్వామివారి ఆలయాన్ని నిర్మించాడని అంటారు. స్వామివారిని పూజించిన వారి మనోభీష్టాలు నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News