అదే స్వామి వారి మహాత్మ్యం
లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో నల్గొండ జిల్లాలోని 'పాలెం' ఒకటిగా కనిపిస్తుంది. నకిరేకల్ సమీపంలో ఈ ప్రాచీన క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. చాలా ప్రదేశాలలో భగవంతుడి ప్రతిమలు భక్తుల ద్వారా వెలుగు చూశాయి. తాను ఫలానా చోటున వున్నానని కలలో స్వామివారు కనిపించి భక్తులకి చెప్పడం వలన, ఆ ప్రతిమలు వెలుగులోకి వచ్చి పూజాభిషేకాలు అందుకుంటున్నాయి.
అలాగే ఇక్కడి స్వామి వారు కూడా వెలుగు చూశాడు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత వుంది. స్వప్నంలో ఓ భక్తుడికి స్వామివారు కనిపించి, తన జాడను తెలియజేశాడు. కానీ మరునాడు ఆ భక్తుడు ఎంత వెతికినా ఆ జాడ తెలియడం లేదు. అప్పుడు ఒక సాధువు వచ్చి, ఫలానా చోట వెతకమని చెప్పి అదృశ్యమయ్యాడట. అలా భగవంతుడే మారు రూపంలో వచ్చి తన జాడను తెలియజేశాడని అంటారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని విశ్వసిస్తుంటారు.