లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం

దుష్ట శిక్షణ కోసం .. శిష్ట రక్షణ కోసం .. ప్రహ్లాదుడు వంటి భక్తుడి విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం .. ఆయనకి ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం కోసం నరసింహస్వామి ఆవిర్భవించాడు. ఆ తరువాత ఆ స్వామి అనేక ప్రదేశాలలో కొలువై భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు. అలా ఆస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా 'నాచగిరి' కనిపిస్తుంది. మెదక్ జిల్లా గజ్వేల్ పరిధిలో .. నదీ తీరంలో స్వామివారు కొండపై వెలసి భక్తులకు దర్శనమిస్తుంటాడు.

లక్ష్మీ సమేతంగా వెలసిన స్వామివారి దివ్యమంగళ మూర్తిని దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఈ స్వామివారు, అనునిత్యం భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వామి వారి దర్శన మాత్రం చేత మానసిక పరమైన .. శారీరక పరమైన అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతారు. పాపాలు నశించి పుణ్య ఫలాలు చేకూరుతాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News