అలా వేంకటేశ్వరుడు వెలిశాడు

వేంకటేశ్వర స్వామి సౌందర్యమే సౌందర్యం .. ఆయన వైభవమే వైభవం. ఆ స్వామి వెలిసిన ఒక్కో క్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలా ఆ దేవదేవుడు వెలసిన క్షేత్రాల్లో ఒకటి మహారాష్ట్ర .. సిరొంచా పరిధిలోని వెంకటాపూర్ లో దర్శనమిస్తుంది. శ్రీదేవి .. భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఇక్కడి చెట్టు తొర్రలో కొలువై ఉంటాడు.

చాలాకాలం క్రితం ఈ ప్రాంతంలో వచ్చిన వరదల్లో ఈ మూల మూర్తులు ఈ ప్రదేశానికి కొట్టుకుని వచ్చి ఆగాయట. ఆ గ్రామస్తులలో కొంతమంది భక్తులకి స్వామివారు కలలో కనిపించి, అదే ప్రదేశంలో తమకి నిత్య పూజలు నిర్వహించవలసింగా ఆదేశించాడని అంటారు. అప్పటి నుంచి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తూ వస్తున్నారు.

స్వామివారు మహిమాన్వితుడనీ .. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆపదల నుంచి ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి స్వామి కాపాడుతూ ఉంటాడని చెబుతుంటారు. తమ కోరికకలు నెరవేర్చిన స్వామికి భక్తులు తల నీలాలు చెల్లించి మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు .. సేవలు కనులపండుగగా జరుగుతుంటాయి.


More Bhakti News