దోషాలను తొలగించే దేవుడు

ఖమ్మం జిల్లాలోని ప్రాచీనమైన క్షేత్రాలలో 'ఇరవెండి' ఒకటిగా కనిపిస్తుంది. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఇక్కడ దర్శనమిస్తుంటాడు. గోదావరి నదీ తీరంలో ఈ ఆలయం అలరారుతోంది. ఇక్కడ స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తాడు కనుక, 'సంతాన వేణుగోపాలస్వామి'గా భక్తులు కొలుస్తుంటారు.

సంతానం విషయంలో ఆలస్యమవుతున్నప్పుడు దంపతులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. స్వామివారి అనుగ్రహం కారణంగా సంతానాన్ని పొందిన ఎంతోమంది దంపతులు ఇక్కడ మొక్కుబడులు చెల్లిస్తూ కనిపిస్తారు. మహాభక్తుడైన రామదాసు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన పాపాలు .. దోషాలు నశించి, పుణ్యఫలాలు చేకూరుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News