దైవంపై విశ్వాసాన్ని విడవకూడదు

జీవితంలో కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి .. ఆపదలు ఆందోళనకి గురిచేస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరైనా సరే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తూనే వుంటారు. గండం నుంచి గట్టెక్కించమని మనసారా ప్రార్ధిస్తూనే వుంటారు. ఏ కష్టమైనా అనుకున్నంత తొందరగా తీరకపోతే, భగవంతుడు తమ మొరను ఆలకించలేదని అసహనానికి లోనవుతుంటారు. ఇంతకాలంగా చేసిన పూజలు వృధా అయ్యాయంటూ ఆవేదన చెందుతుంటారు.

దైవాన్ని అలా ఎప్పుడూ నిందించకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎందుకంటే తనపై అపారమైన విశ్వాసం ఉంచిన వారిని భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. ఎలాంటి ఆపదలు ఎదురైనా వచ్చి రక్షిస్తుంటాడు. భగవంతుడు వున్నాడు .. అంతా ఆయన చూసుకుంటాడు అనే విశ్వాసం, ఆ స్వామి దిగివచ్చేలా చేస్తుంది. పోతన .. త్యాగయ్య .. క్షేత్రయ్య .. అన్నమయ్య .. రామదాసు .. తులసీదాసు .. తుకారామ్ .. జ్ఞానదేవుడు తదితరుల జీవితంలో జరిగిన సంఘటనలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News