కోరికలను నెరవేర్చే కామాక్షీ అమ్మవారు

పెన్నా నదీ తీరంలో కొలువుదీరిన క్షేత్రాల్లో కామాక్షీతాయి ఆలయం ఒకటి. నెల్లూరు జిల్లా 'జొన్నవాడ'లో ఈ క్షేత్రం అలరారుతోంది. శ్రీ మల్లికార్జునస్వామి సమేతంగా ఇక్కడ అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి మూర్తి పెన్నా నదిలో లభించడం విశేషం. అలా నదిలో దొరికిన అమ్మవారి మూర్తికి తీరంలో ఆలయాన్ని నిర్మించారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో, వినాయకుడు .. కుమారస్వామి ఉపాలయాలు దర్శనమిస్తాయి.

పెన్నా నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమగలదని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. సంతాన సౌభాగ్యాలను .. సిరి సంపదలను అమ్మవారు అనుగ్రహిస్తుందని అంటారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి చెప్పుకుంటే, అది తప్పక నెరవేరుతుందని చెబుతారు. అలా తమ కోరికలు నెరవేరిన వారు మొక్కుబడులు చెల్లిస్తూ ఇక్కడ పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు.


More Bhakti News