భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉంచాలి

చాలా మంది భగవంతుడి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి వుంటారు. చదువున్నకున్న వారు ఆయా స్తోత్రాలు చదువుతూ భగంతుడిని అనుగ్రహాన్ని పొందుతూ ఉంటే, ఇక చదువుకు దూరమైన వాళ్లు సైతం సేవల ద్వారా భగవంతుడి ప్రీతిని పొందుతుంటారు. మంచి జరిగితే అదంతా ఆ దేవుడి దయ అనుకుంటారు .. లేదంటే మనం స్వయంగా చేసుకున్నదానికి ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు అని నిట్టూరుస్తారు. అంతేగాని ఎలాంటి పరిస్థితుల్లోను దేవుడిని నిందించరు.

ఇక కొంతమంది మాత్రం తాము ఇష్టపడిన దేవుడికి తమ కోరికలు చెబుతూ వెళుతుంటారు. ఆ కోరికలు నెరవేరకపోతే వెంటనే ఆ దైవంపై నమ్మకాన్ని కోల్పోతారు. మరో దైవాన్ని ఆశ్రయించి అక్కడ తమ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అక్కడ తగిన ఫలితం కనిపించకపోతే మరో దేవుడు .. ఇలా అవసరాన్ని బట్టి .. అవకాశాన్ని బట్టి తాము ఆరాధించే దేవుళ్లను మార్చేస్తుంటారు.

అలాంటి పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఏ రూపంలో దర్శనమిస్తున్నా .. ఏ నామంతో పిలవబడుతున్నా భగవంతుడు ఒక్కడే. అలాంటి భగవంతుడిపై పూర్తి విశ్వాసం వుంచాలేగానీ, విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News