అలా గణపతి ఏకదంతుడయ్యాడు

ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోవడానికి పరశురాముడు కైలాసానికి వెళతాడు. ద్వారం చెంత అతణ్ణి గణపతి అడ్డుకుంటాడు. అది తన తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకునే సమయమనీ .. ముందుగా తాను వెళ్లి అతని రాకను గురించి చెప్పివస్తానని అంటాడు. అవమానంగా భావించిన పరశురాముడు, పక్కకి తప్పుకోమంటూ గణపతిని దాటుకుని లోపలికి ప్రవేశించబోతాడు. దాంతో ఆగ్రహించిన గణపతి, పరశురాముడిని తన తొండంతో గిరగిరా తిప్పి వదులుతాడు.

ఆవేశం కట్టలు తెంచుకోవడంతో, పరశురాముడు తన గొడ్డలితో గణపతిపై దాడి చేయగా ఆయన దంతం విరిగిపోతుంది. బాధతో గణపతి అరవగా లోపలి నుంచి పార్వతీ పరమేశ్వరులు బయటికి వస్తారు. జరిగింది తెలుసుకుని పుత్ర సమానుడైన పరశురాముడిని ఏమీ అనలేక పార్వతీదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి, పార్వతీదేవిని ఓదారుస్తాడు. ఇకపై దేవతలచే .. మానవాళిచే 'ఏకదంతుడు'గా గణపతి పూజలు అందుకుంటాడంటూ పార్వతీదేవికి ఊరట కలిగిస్తాడు.


More Bhakti News