శివ ఉపచార ఫలితం

పరమ శివుడు భక్తుల పాలిట కామధేనువు .. కల్పవృక్షము. భక్తుల కోరికలను నెరవేర్చడానికి వరాల మూటతో ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అంకితభావంతో .. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనని సేవిస్తే చాలు, అపారమైన కరుణునను కురిపిస్తాడు. ఇక ఆయనకి వివిధ ఉపచారాలు చేయడం వలన మరింతగా ప్రీతి చెందుతాడు. ఒక్కో ఉపచారము వలన ఒక్కో విశేష ఫలితాన్ని అనుగహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పరమశివుడికి అభిషేకాన్ని చేయడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. ఆయనకి గంధం సమర్పించడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. ఆయనకి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన ఆయుష్షు పెరుగుతుంది. శివయ్యకి దీపాన్ని చూపించడం వలన అజ్ఞానం తొలగిపోవడమే కాకుండా, అంధత్వం రాకుండా ఉంటుంది. ఇక తాంబూలం సమర్పించడం వలన సంపదలు వృద్ధి చెందుతాయని ఆధ్యాత్మిల గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన సదాశివుడి అనుగ్రహం కోసం ఆ దేవదేవుడికి భక్తితో ఉపచారాలు చేయడం మరిచిపోవద్దు.


More Bhakti News