ఆపదలు తొలగించే అమ్మవారు

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఏ రూపంలో వున్నా .. ఏ పేరుతో కొలవబడుతూ వున్నా అమ్మ ప్రేమతో అనుగ్రహిస్తూనే ఉంటుంది. అందువల్లనే అమ్మవారి ఆలయాలు ఎక్కడ వున్నా భక్తులతో నిత్యం సందడిగా కనిపిస్తూనే ఉంటాయి. అమ్మవారిని పూజించడం వలన సౌభాగ్యం నిలుస్తుందని .. సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఇక అమ్మవారు ఆవిర్భవించిన 'అష్టమి' తిథి రోజున ఆ తల్లిని పూజించడం మరింత మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అష్టమి రోజున అమ్మవారిని పూజించడం వలన .. పారాయణం చేయడం వలన .. ఆ రోజున 8 రకాల వంటకాలు నైవేద్యంగా సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా అనారోగ్యాలు .. ఆపదలు దరిచేరవు. జీవితాన్ని అనారోగ్యాలు .. ఆపదలు అతలాకుతలం చేస్తుంటాయి. అందువలన అలాంటి గండాల బారిన పడకుండా అష్టమి రోజున అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి.


More Bhakti News