పోలమాంబ అని అందుకే పిలుస్తారు

విశాఖ జిల్లా పరిధిలోని పెదవాల్తేరులో గల 'పోలమాంబ' ఆలయంలో దుర్గాదేవి .. లక్ష్మీదేవి .. సరస్వతీ దేవి మూల మూర్తులు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. ఈ మూర్తులలో దుర్గాదేవి మూర్తిని 'పోలమాంబ'గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు.

సాధారణంగా సముద్రంలో జాలర్లు 'వల' విసిరినప్పుడు దేవతా విగ్రహాలు ఆ వలలో పడటమనేది జానపద కథల్లో వింటూ ఉంటాము. కానీ నిజంగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం, చేపల వేటకి సముద్రంలోకి వెళ్లిన ఇక్కడి జాలరులు 'వల' విసరగా అందులో దుర్గాదేవి మూర్తి పడింది. అమ్మవారి మహిమగా భావించిన జాలరులు ఆ ప్రతిమను తీసుకువచ్చి తాత్కాలికంగా ఒక 'కరకచెట్టు' క్రింద ఉంచారు.

ఆ తరువాత భక్తుల సంకల్పంతో అమ్మవారికి ఆలయం నిర్మించబడింది. ఈ అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి వర్షాలు బాగా కురవడం .. పొలాలు కళకళలాడుతూ ఉండటం జరుగుతోంది. ఆరంభంలో కరకచెట్టు క్రింద ఉండటం వలన .. పొలాలు పచ్చగా వుంచుతున్నందు వలన ఈ అమ్మవారిని 'కరకచెట్టు పోలమాంబ'గా భక్తులు పూజిస్తుంటారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News