అదే లేడి బండ ప్రత్యేకత!

శ్రీరామచంద్రుడు తన భక్తులను అనుగ్రహిస్తూ అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రాల్లో 'వీరాచలం' ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది వరంగల్ జిల్లా పరిధిలో అలరారుతోంది. ఒక భక్తుడి తపస్సుకు మెచ్చి స్వామి ఇక్కడ ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది.

ఈ ఆలయానికి సమీపంలో 'లేడి బండ' కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఒక గుంటలో నుంచి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఇది ఏ కాలంలోను పెరగడం గానీ .. తగ్గడం గాని జరగదు. అలాగే ఇంతవరకూ నీరు రాకపోవడమనేది ఎన్నడూ జరగలేదని స్థానికులు చెబుతారు.

లేడి రూపంలో వచ్చిన ఒక గంధర్వుడికి పవిత్రమైన జలంతో శాప విమోచనం కలిగించడం కోసం, శ్రీరాముడు తన కాలు బొటనవ్రేలుని ఈ బండపై నొక్కిపట్టి .. గంగాదేవిని ప్రార్ధించాడట. అంతే అక్కడి నుంచి గంగ పొంగుతూ వచ్చిందనీ, ఆ జలంతో శ్రీరాముడు ఆ గంధర్వుడికి శాప విమోచనం కలిగించాడని చెబుతారు. లేడి రూపంలోని గంధర్వుడికి శాప విమోచనం కలిగిన ప్రదేశం కనుక, దీనిని 'లేడి బండ'గా పిలుస్తుంటారు .. ఈ జలం మహిమాన్వితమైనదిగా విశ్వసిస్తుంటారు.


More Bhakti News