శివలింగార్చన ఫలితం

పరమశివుడు లింగరూపంలోనే ఆయా క్షేత్రాల్లో ఆవిర్భవించాడు. ఆ రూపంలోనే పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తుంటాడు. శివలింగార్చన వలన తరించిన మహాభక్తులు ఎంతోమంది వున్నారు. సాధారణంగా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి కొంతమంది తపస్సులు .. యజ్ఞాలు చేస్తుంటారు. అలాగే పుణ్య ఫలాలను పొందడానికి దానాలు చేస్తుంటారు. ఆయా పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు.

తపస్సు ద్వారా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. యజ్ఞాల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. తీర్థయాత్రల వలన ఆధ్యాత్మిక జీవనంలోని ఆనందం ఏమిటో తెలుస్తుంది. దానధర్మాల వలన ఎలాంటి పుణ్య ఫలితా లు లభిస్తాయో అర్థమవుతుంది. ఆ మార్గంలో జీవితాన్ని కొనసాగించడానికి దోహదం చేస్తుంది. ఇలా తపస్సు ద్వారా .. యజ్ఞాలద్వారా .. తీర్థయాత్రల ద్వారా లభించే పుణ్యఫల విశేషం ఏదైతే వుందో, అదంతా కూడా శివలింగార్చన వలన చేకూరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివలింగార్చన మహా విశేషమైనదని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News