లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర మహిమ

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'గీసుకొండ' ఒకటి. వరంగల్ జిల్లాలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి కొండపై లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరి వున్నాడు. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించు కోవడం వలన .. ఈ స్వామిని పూజించడం వలన గండాలు నుంచి గట్టెక్కడం జరుగుతుందని అంటారు.

ఈ క్షేత్రంలో 'చింతామణి' కోనేరు దర్శనమిస్తుంది. ఈ కోనేటిలో స్నానం చేయడం వలన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని చెబుతారు. ఈ కోనేరులోకి నిరంతరం నీటి ధార చేరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఎవరికీ తెలియక పోవడం విశేషం. ఆ విషయాన్ని కనుక్కోవడానికి కొంతమంది ప్రయత్నించి విఫలమయ్యారు. కోనేరులోకి వచ్చే నీటి ధార .. అందులో స్నానం చేసే వారి సంఖ్యను బట్టి పెరగడం .. తరగడం జరుగుతూ ఉంటుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి మహిమగా వాళ్లు విశ్వసిస్తుంటారు.


More Bhakti News