శివలింగ ఆరాధన ఫలితం!

పరమశివుడు భూలోకాన లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక, ఆయనని అంతా ఆ రూపంలోనే పూజిస్తూ వుంటారు. నిత్యం ఆలయాలకు వెళ్లి శివలింగ దర్శనం చేసుకునే వాళ్లు కొందరైతే, చిన్నపాటి శివలింగాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని ఆరాధించేవారు మరికొందరు. అయితే ఆయా రకాల పదార్థాలతో తయారు చేసిన శివలింగాలను ఆరాధించడం వలన కూడా విశేషమైన ఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సాధారణంగా భక్తులు పాపాలు నశించి పుణ్య ఫలితాలను పొందడానికీ .. ఆయురారోగ్యాల కోసం ఆ శివయ్యను ప్రార్ధిస్తుంటారు. 'ఆవు పేడ'తో చేసిన శివలింగాన్ని పూజించడం వలన అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక 'అన్నము'తో చేసిన శివలింగాన్ని ఆరాధించడం వలన, దీర్ఘాయువు లభిస్తుందని పేర్కొంటున్నాయి. అదే విధంగా 'గంధం'తో చేసిన శివలింగాన్ని సేవించడం వలన సమస్త పాపాలు నశించి .. పుణ్యరాశి పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News