కష్టాలు తీర్చు కాలాంజనేయుడు

హనుమంతుడు ఆయా క్షేత్రాలలో .. వివిధ రూపాలలో పూజలు అందుకుంటూ ఉంటాడు. భక్తాంజనేయుడు .. దాసాంజనేయుడు .. యోగాంజనేయుడు .. ప్రసన్నాంజనేయుడుగా ఆయన భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి హనుమంతుడు 'కాలాంజనేయుడు'గా పూజలు అందుకునే ఆలయం హైదరాబాద్ - అత్తాపూర్ లోదర్శనమిస్తుంది.

ప్రాచీనకాలం నాటి 'అనంత పద్మనాభస్వామి' ఆలయ ప్రాంగణంలో కాలాంజనేయస్వామి కొలువుదీరి కనిపిస్తుంటాడు. అక్కన్న - మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. ఇక్కడ హనుమంతుడు నల్లని రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు గనుక, కాలాంజనేయస్వామిగా పిలుస్తుంటారు. స్వామివారికి సిందూరం కాకుండా సంపెంగ తైలం పూయడం ఇక్కడి ప్రత్యేకత.

స్వామివారు ఇరువైపులా శంఖు చక్రాలు కలిగి ఉండటం విశేషం. ఇక్కడి స్వామి వారిని పూజించడం వలన .. అంకితభావంతో ఆయనని సేవించడం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తులు చెబుతుంటారు. దోషాలు .. పాపాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News