చెన్నకేశవస్వామి మహిమ!

శ్రీమహావిష్ణువు .. శ్రీచెన్నకేశవస్వామిగా ఆవిర్భవించిన క్షేత్రాలలో ఒకటిగా 'ఉల్లిపాలెం' కనిపిస్తుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మహిమాన్వితమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా వెలుగొందుతోంది. 'నగరం' మండలంలోని ఈ క్షేత్రంలో శ్రీ భూ నీలాదేవి సమేత చెన్నకేశవస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ వస్తున్నాడు.

ఇక్కడ స్వామి కొలువుదీరడం వెనుకనే ఆయన మహిమ ఎంతటిదో తెలుస్తుంది. పూర్వం ఇక్కడి గ్రామంలోని జమీందారుకి కలలో స్వామివారు కనిపించి తన జాడ తెలియజేసి, తనని ఈ గ్రామంలో ప్రతిష్ఠించి పూజించమని చెప్పాడట. అయితే ఇది సాధారణమైన కలే అనుకుని ఆయన తన దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమై వున్నాడు.

దాంతో మరుసటి రోజు రాత్రి ఆయనకి స్వామి మళ్లీ స్వప్నంలో కనిపించడమే కాకుండా, తాను చెప్పిన విషయాన్ని మరోమారు గుర్తుచేశాడట. అంతేకాకుండా వెంటనే తన మూర్తిని ఆ గ్రామానికి తరలించమంటూ తట్టి లేపాడట. అప్పుడు ఆయన ఆ పనికి పూనుకుని 'అల్లపర్రు'లోని స్వామివారి ప్రతిమను 'ఉల్లిపాలెం' చేర్చారట. అలా స్వామి తమ గ్రామానికి కోరి వచ్చాడు కనుక, ఇక్కడి ప్రజలంతా స్వామిని తమ ఇష్టదైవంగా భావిస్తుంటారు. అనునిత్యం ఆ స్వామిని కొలుస్తూ తరిస్తుంటారు.


More Bhakti News