పరమశివుడికి ప్రదక్షిణలు చేస్తే చాలు!

వెన్నవంటి మనసున్నవాడిగా .. వెన్నెల వంటి చల్లని చూపున్నవాడిగా పరమశివుడు కొనియాడబడుతున్నాడు. భక్తుల కోరిక మేరకు .. భక్తుల కోరికలను నెరవేర్చేందుకు ఆ స్వామి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అవన్నీ కూడా పరమపవిత్రమైన క్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఆ స్వామి మహిమలతో వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో నెల్లూరు జిల్లాలోని 'ఓంకార సిద్ధేశ్వర స్వామి' క్షేత్రం ఒకటిగా కనిపిస్తుంది.

ప్రాచీనకాలంనాటి స్వామివారి ఆలయం, గోపురాలతో.. ప్రాకారాలతో .. మంటపాలతో .. ఆనాటి వైభవానికి అద్దంపడుతూ వుంటుంది. ఎంతోమంది మహర్షులు .. మహారాజులు ఇక్కడి స్వామివారిని పూజించి తరించారని అంటారు. ఆదిదేవుడు కొలువైన ప్రతి క్షేత్రం కూడా ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.

అలా ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే చాలు .. మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారికి ప్రదక్షిణలు చేయడం వలన, ఆపదలు .. ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతుంటారు. వ్యాధులు నయమవుతాయనీ .. బాధలు దూరమవుతాయని అంటారు.


More Bhakti News