ఆపదలను తొలగించే ఆదిదేవుడి క్షేత్రం

ప్రాచీనకాలంనాటి శివాలయాలను దర్శిస్తే, శ్రీరాముడు ప్రతిష్ఠించినవిగా కొన్ని శివలింగాలు కనిపిస్తుంటాయి. అలాగే మరికొన్ని శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినవిగా స్థలపురాణాన్ని బట్టి తెలుస్తుంటుంది. అలా పాండవుల కాలంలో ప్రతిష్ఠించబడిన శివలింగం కర్నూలు జిల్లా 'లింగమేశ్వరం'లో కనిపిస్తుంది.

అరణ్యవాస కాలంలో పాండవులు ఈ ప్రాంతానికి వచ్చారట. ఆ సమయంలోనే ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు. చాళుక్యులు ఇక్కడి స్వామివారిని సేవించి తరించినట్టు శాసన ఆధారాలను బట్టి తెలుస్తోంది. సప్తనదీ సంగమ క్షేత్రంగా ఇది అలరారుతోంది. అందువల్లనే స్వామివారు 'సంగమేశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

ఇక్కడి స్వామివారిని పూజించడం వలన ముక్తి లభిస్తుందని చెబుతారు. అంతేకాదు .. స్వామివారి ఆరాధన వలన ఆపదలు దరిచేరవని అంటారు. ఆయన దర్శనం చేసుకుంటామని మొక్కుకుంటే, ఎలాంటి ఆపదలైనా వెంటనే తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. విశేషమైన రోజుల్లో దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News