కోరిన వరాల నిచ్చే కొండంత దేవుడు

'రామ' నామాన్ని స్మరించడం వలన సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరతాయి. రాముడు ధర్మానికి ప్రతీకగా కనిపిస్తే, సీతమ్మతల్లి ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి ఆనవాలుగా అనిపిస్తుంది. అందుకే సీతారాములను స్మరించని వారుగానీ, ఆ స్వామి కొలువైన ఆలయాలను దర్శించనివారు గాని ఉండరని చెప్పొచ్చు.

సీతారాములు ప్రతి మనసులోనూ కొలువై ఉన్నందున, ప్రతి ఊరులోను తప్పనిసరిగా రామాలయం వుంటుంది. అందుకే ఊరంతా కలిసి జరుపుకునే పండుగగా 'శ్రీరామనవమి' కనిపిస్తుంది. అలా సీతారాములు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో ఒకటి నిజామాబాద్ జిల్లా 'డిచ్ పల్లి'లో వెలుగొందుతోంది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర వుంది.

ఈ ఆలయాన్ని చూడగానే గతంలో వైభవంతో వెలుగొందిందనే విషయం అర్థమైపోతూ వుంటుంది. ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని కనుల ముందుంచుతుంది. ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఈ ఆలయంలో అడుగుపెట్టగానే, మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. విశేషమైన పర్వదినాల్లో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి సీతారాములను దర్శించుకోవడం వలన, ఎలాంటి కష్టనష్టాల నుంచైనా గట్టెక్కడం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News