నరక చతుర్దశి రోజున ఇలా చేయాలి!

ఆశ్వయుజ బహుళ చతుర్దశి .. నరక చతుర్దశిగా చెప్పబడుతోంది. నరకలోకానికి అధిపతి అయిన యమధర్మ రాజుకి ఇది ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి .. నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి .. నీటిలో గంగాదేవి ఆవేశించి ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజున స్నానం చేయడానికి ముందు నీటిని తుమ్మి .. తగిరస .. ఉత్తరేణి చెట్ల కొమ్మలతో కలియబెట్టాలి. ఆ తరువాత ఆ చెట్ల కొమ్మలను తలచుట్టూ తిప్పుకుంటూ స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేసిన తరువాత యమధర్మరాజుకి గల 14 నామాలతో ఆయనని పూజించాలి. ఈ రోజున మినుములతో తయారు చేసిన పదార్థాలతో భోజనం చేయడం మంచిదని అంటారు. ఈ రోజున సాయంత్రం ఇంటిలోనూ .. ఆలయ ప్రాంగణంలోను దీపారాధన చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News