వైకుంఠ ప్రాప్తిని కలిగించే ఏకాదశి

శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా ఏకాదశి కనిపిస్తుంది. శ్రీమహా విష్ణువు అనుగ్రహాన్ని అనతికాలంలో కలిగించడం ఏకాదశి వ్రత ఫలితంగా చెప్పబడుతోంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత వుంది. ప్రతి ఏకాదశి ఆ స్వామి పాదాల చెంత స్థానం కల్పించేదే .. ఆయన అనుగ్రహాన్ని అందించేదే. అలాంటి ఏకాదశులలో ఆశ్వయుజ బహుళ ఏకాదశి ఒకటిగా చెప్పబడుతోంది. దీనినే 'ఇందిరా ఏకాదశి' అని అంటారు.

పూర్వం ఇంద్రసేనుడనే మహారాజు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి, తన తండ్రికి మోక్షం కలిగేలా చేశాడు. అందువల్లనే ఈ ఏకాదశికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇలా ఈ రోజున చేసే విష్ణు పూజ వలన, ఇహలోకంలోని వారికి సుఖము .. నరకలోకంలో వున్న మాతా పితరులకు వైకుఠ ప్రాప్తి కలుగుతాయని ఈ వ్రత మహాత్మ్యం చెబుతోంది. ఇంతటి విశేషమైన ఫలితాన్ని అందించే ఈ ఏకాదశి రోజున ఆ శ్రీమహా విష్ణువును సేవించే భాగ్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.


More Bhakti News