సకల శుభాలనిచ్చే వరలక్ష్మీ వ్రతం

పుణ్య స్త్రీలు ఆచరించదగిన అత్యంత విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా 'వరలక్ష్మీ వ్రతం' చెప్పబడుతోంది. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ రోజున ఉదయాన్నే పుణ్య స్త్రీలు మంగళస్నానాలు ఆచరించి .. నూతన వస్త్రాలను ధరించి .. పూజా మందిరంలో కలశస్థాపన చేసుకుని .. లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవలసి ఉంటుంది.

ముందుగా గణపతిని ఆరాధించి .. ఆ తరువాత "బధ్నామి దక్షిణ హస్తే నవ సూత్రం శుభప్రదం .. పుత్ర పౌత్రాభి వృద్ధంచ సౌభాగ్యం దేహిమే రమే ''అనే శ్లోకాన్ని పఠిస్తూ తొమ్మిది ముడులు గల తోరాన్ని చేతికి ధరించాలి. కొబ్బరినూనెతో వెండి ప్రమిదల్లో దీపారాధన చేసి, అమ్మవారిని షోడశ ఉపచారలతో సేవిస్తూ .. గులాబీలతో పూజించాలి.

వరలక్ష్మీ వ్రతకథను చదువుకుని .. అక్షింతలు తలపై ధరించి .. తీపిపదార్థాలను .. పండ్లను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ముత్తయిదువులకి వాయనం ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన, సంపదలు .. సంతాన సౌభాగ్యాలు .. సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News