మారెమ్మ తల్లి మహిమ

అమ్మవారు వివిధ నామాలతో .. రూపాలతో ఆయా గ్రామాల్లో పూజలు అందుకుంటూ వుంటుంది. అయితే అమ్మవారు చూపే మహిమల వలన, ఆ గ్రామ వాసులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ వుంటారు. అలా ఒక గ్రామదేవత ఆలయం .. ఒక పుణ్యస్థలిగా మారిన తీరు 'మారెమ్మ' ఆలయం విషయంలో కనిపిస్తుంది.

అనేక ప్రాంతాల్లో అలరారుతోన్న విశిష్టమైనటువంటి మారెమ్మ ఆలయాలలో 'పల్లెగూడెం'లోని అమ్మవారి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం నుంచి 'ములకలపల్లి' వెళ్లే దారిలో పల్లెగూడెం కనిపిస్తుంది. ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ప్రతి గురు .. ఆదివారాల్లో ఈ ఆలయానికి విశేషమైన సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

అమ్మవారిని దర్శించుకుని .. మొక్కుబడులు చెల్లించే భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ వుంటుంది. అమ్మవారి మహిమలు భక్తుల అనుభవాల ద్వారా వెలుగుచూస్తూ వుంటాయి. సంతాన సౌభాగ్యాలను .. సంపదలను అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుందని చెబుతుంటారు. ఆపదలను తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ ఉంటుందని అంటారు. కోరికలను నెరవేర్చే కొంగుబంగారంగా అమ్మవారిని ఆరాధిస్తూ .. ఆ తల్లి ఆశీస్సులతో సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందుతుంటారు.


More Bhakti News