శుద్ధ జలంతో శివాభిషేక ఫలితం!

అడిగిన వెంటనే ఆదిదేవుడు అనంతమైన వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. కోరిన కోర్కెలను నెరవేరుస్తూ సంతోషాన్నీ .. సంతృప్తిని కలిగిస్తుంటాడు. అందుకే ఆ స్వామి అనుగ్రహం కోసం భక్తులు ఆయనకి ఇష్టమైన అభిషేకాన్ని జరపడానికి ఆసక్తిని చూపుతుంటారు.

పరమశివుడికి ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకాన్ని జరపడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా ఆ స్వామిని 'శుద్ధ జలం'తో అభిషేకించడం వలన కరవుకాటకాలు దరిచేరవని స్పష్టం చేస్తున్నాయి.

లోకంలోని జనులంతా సుఖసంతోషాలతో జీవిచడానికి అవసరమైనది వర్షం. సకాలంలో వర్షాలు కురవడం వల్లనే పంటలు పండుతాయి. పంటలు బాగా పండినప్పుడే మనుషులకు .. పశువులకు .. పక్షులకు .. ఆహార కొరత ఏర్పడకుండా వుంటుంది. చెరువులు .. బావులు .. నదులలోకి నీరు పుష్కలంగా చేరుతుంది .. మూగజీవుల దాహార్తి తీరుతుంది.

ఇలా సమస్త జీవరాశి మనుగడ నీటిపైనే ఆధారపడి వుంటుంది. అలాంటి నీరు వర్షం వలన లభిస్తుంది .. ఆ వర్షం పలకరించని పరిస్థితుల్లో ఆదిదేవుడి అనుగ్రహం అవసరమవుతుంది. అలాంటప్పుడు ఆ ప్రాంతలోని వాళ్లు శివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేయడం వలన, ఆ స్వామి కరుణా కటాక్షాల వలన వర్షం కురిసి కరువుకాటకాల బారినపడకుండా కాపాడుతుంది.


More Bhakti News