సాయం సంధ్యలో సదాశివుని ఆరాధన

ఐశ్వర్యం ఆనందాన్ని సొంతం చేసుకునేందుకు ఉపకరిస్తుంది. అవసరలాలో నుంచీ .. ఆపదల్లో నుంచి గట్టెక్కిస్తుంది. ఆర్ధికపరమైన కోరికలను నెరవేర్చు కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనే ఒక భరోసాను కలిగిస్తుంది. అంతేకాదు భగవత్ సంబంధమైన కార్యాలను జరిపించడానికి అడుగు ముందుకు వేసే ధైర్యాన్నిచ్చి, స్వామి సేవలో తరించామనే సంతృప్తిని ఇస్తుంది.

ఇక దారిద్ర్యమనేది తనతో పాటుగా అనేక సమస్యలను వెంటేసుకుని వస్తుంది. సంతోషాలకు .. సంతృప్తికి దూరం చేస్తుంది. జీవితం పట్ల నిరాశా నిస్పృహలను కలిగిస్తుంది. అలాంటి దారిద్ర్య బాధల నుంచి బయటపడటానికి భగవతుడి పాదాలను ఆశ్రయించేవాళ్లు ఎంతోమంది వున్నారు. అలాంటివాళ్లు 'ప్రదోషవేళ'లో సదాశివుడిని పూజించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సాయం సంధ్యా సమయం పరమశివుడికి అత్యంత ఆనందకరమైన సమయం. అలాంటి ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు జరపడం వలన .. ఆ స్వామి నామాన్ని జపించడం వలన .. ఆయా భక్తులను ఆయన అనుగ్రహించిన వైనానికి సంబంధించిన కథలను చదువుకోవడం వలన, దారిద్ర్యము .. దాని కారణంగా కలిగే దుఃఖము నివారించబడతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News