అయిదోతనాన్ని నిలిపే వ్రతం

ఎంతోమంది మహా పతివ్రతలు భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రభావితం చేశారు. ఇంద్రాది దేవతలను సైతం తమ ప్రాతివ్రత్య మహాత్మ్యంచే ఆశ్చర్యచకితులను చేశారు. అలాంటి పతివ్రతలలో సతీసావిత్రి కూడా మనకి కనిపిస్తూ వుంటుంది. సావిత్రి .. తన భర్త అల్పాయుష్కుడని తెలిసి జ్యేష్ఠశుద్ధపౌర్ణమి రోజున వట వృక్షాన్ని పూజిస్తుంది. విధిరాత ప్రకారం సావిత్రి భర్త ఆయుష్షు తీరగానే మరణిస్తాడు. అయితే యముడితో పోరాడి ఆమె తన భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకుంటుంది.. తన అయిదోతనాన్ని కాపాడుకుంది.

ఆమె వట వృక్షాన్ని పూజించి తన భర్త ప్రాణాలను కాపాడుకున్న ఈ రోజున వటవృక్షాన్ని పూజించడం ఒక వ్రత విధానంగా వస్తోంది. అందువల్లనే దీనిని వటసావిత్రి వ్రతంగా ఆచరిస్తుంటారు. ఈ రోజున పసుపు దారాన్ని వటవృక్షానికి చుడుతూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన చిరకాలం అయిదోతనంతో జీవిస్తారని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News