లక్ష్మీదేవికి ఇలా ప్రీతి కలుగుతుంది

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకోనివాళ్లంటూ ఎవరూ వుండరు. ఎందుకంటే ఎవరి జీవితమైనా ఆనందంగా ... హాయిగా సాగిపోవడంలో లక్ష్మీదేవియే ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. చిన్నచిన్న నిత్యవసారాల దగ్గర నుంచి పెద్దమొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీల వరకు లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా ఏదీ నడవదు. ధనమనేది ఏ రూపంలో వున్నా అది లక్ష్మీస్వరూపంగానే వ్యవహరించబడుతుంది.

ధనమనేది అన్ని సమస్యలను తీర్చలేకపోయినా, కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి అది తప్పనిసరిగా అవసరమవుతూనే వుంటుంది. అందుకే చాలామంది ధనానికి అంతటి ప్రాధాన్యతను ఇస్తుంటారు. సంపద పెరగాలన్నా ... ఆ సంపద స్థిరంగా ఉండాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కావలసిందే. అందుకే ఆ తల్లి చిత్రపటాన్నిగానీ ... ప్రతిమనుగాని పూజామందిరంలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. ఆమె కటాక్షం కోరుతూ అనునిత్యం పూజిస్తూ వుంటారు.

అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఆమెకి ప్రీతిని కలిగించవలసి వుంటుంది. లక్ష్మీదేవికి పాయసం అంటే ఎంతో ఇష్టం ... అలాగే అరటిపండ్లు ... జామపండ్లన్నా ఎంతో ఇష్టం. అందువలన శుక్రవారం రోజున అమ్మవారిని పూజించిన తరువాత వీటిని నైవేద్యంగా సమర్పించడం మంచిదని చెప్పబడుతోంది. అమ్మవారికి ఇష్టమైన వాటిని నైవేద్యం పెట్టడం వలన ఆ తల్లి సంతృప్తి చెందుతుందనీ, భక్తుల మనోభీష్టాన్ని నెరవేర్చుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News