నిజ ప్రదక్షిణ

సాధారణంగా ప్రధాన ద్వారం దాటుకుని గుడిలోకి వెళ్లగానే,ముందుగా ప్రదక్షిణలు పూర్తిచేసి తరువాతే దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. ప్రదక్షిణం అంటేనే ... సమస్త భయాలను ... వ్యాధులను తరిమేసి సకలసంపదలు ప్రసాదించేదని అర్థం. పాద ప్రదక్షిణము ... అంగ ప్రదక్షిణం ... దండ ప్రదక్షిణం ... మిశ్రమ ప్రదక్షిణం అని ప్రదక్షిణలు నాలుగు రకాలుగా వుంటాయి. ఈ ప్రదక్షిణలను మూడు ... అయిదు ... తొమ్మిది ... పదకొండు ... ఇలా బేసి సంఖ్యలో చేస్తుంటారు.

దైవం ఏదైనా .... ప్రదక్షిణలు ఎన్నయినా గుండెల నిండుగా భక్తి శ్రద్ధలను నింపుకోవడమే ప్రధానం. ప్రదక్షిణలు చేయునపుడు ఆచరించవలసిన కొన్ని నియమాలను గురించి, శౌనకాది మహర్షులకు సూతుడు వివరించాడు. ప్రదక్షిణలు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో గబగబా నడవడం గానీ .. పరిగెత్తడం గాని చేయకూడదు. ప్రదక్షిణ చేస్తోన్న సమయంలో వినయపూర్వకంగా చేతులు జోడించి వుండాలి. పరమాత్మను మనసులో నిలుపుకుని .... ఆయననే ధ్యానిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి.

నియమబద్ధమైన ప్రదక్షిణలే నిజమైన ప్రదక్షిణలనీ, అంకితభావంతో చేసినప్పుడు తగిన ఫలితాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. దైవానికే కాదు ... తల్లిదండ్రులకు, గురువులకు చేసే ప్రదక్షిణలు కూడా అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయనడానికి పురాణ గాధలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


More Bhakti News