ఈ దివ్యక్షేత్రాలు వాళ్లు మాత్రమే దర్శించగలరు

శ్రీమహావిష్ణువు అనేక ప్రాంతాలలో ఆవిర్భవించి తన భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ వుంటాడు. వీటిలో కొన్ని క్షేత్రాలను ఆళ్వారులు దర్శించి తమ పాశురాలతో అక్కడి స్వామివారిని కీర్తించారు. అలా స్వామివారు కీర్తించబడిన క్షేత్రాలు 'వైష్ణవ దివ్యక్షేత్రాలు'గా చెప్పబడుతున్నాయి. వీటినే దివ్యతిరుపతులుగా పేర్కొంటూ వుంటారు. ఆయా ప్రాంతాలలో నూటాఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు విలసిల్లుతున్నాయి.

ఇవి అత్యంత మహిమాన్వితమైనవిగా ... శక్తిమంతమైనవిగా అలరారుతున్నాయి. ఈ దివ్యక్షేత్రాలు ఎంతో స్థలమహాత్మ్యాన్ని కలిగివుంటాయి. స్వామివారు ... అమ్మవారు వివిధ నామాలతో కొలువుదీరి పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. ఇక్కడగల తీర్థాలు కూడా మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. స్వామివారు ఆవిర్భవించిన తీరు, దేవతలకు .. మహర్షులకు ... మహాభక్తులకు దర్శనమిచ్చిన వైనం ఆసక్తికరంగా వినిపిస్తూ వింటుంది.

అలాంటి నూటా ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ... 'తిరుప్పార్ కడల్' (క్షీర సముద్రం) ... 'తిరునాడు' (పరమపదం) అనే రెండు దివ్యక్షేత్రాలు మాత్రం మానవమాత్రులకు కనిపించవని చెప్పబడుతోంది. ఈ రెండు దివ్యక్షేత్రాలు దేవతలకు ... మహర్షులకు ... మోక్షాన్ని పొందినవారికి మాత్రమే కనిపిస్తాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News