ఈ రోజున డుంఢి గణపతిని పూజించాలి

సకలశుభాలను అందించే నాయకుడు ... వినాయకుడు. ఆయన ఆశీస్సులతో ... అనుగ్రహంతో వేసిన అడుగుమాత్రమే సత్ఫలితాలనిస్తుంది. అందువల్లనే భక్తులు అనునిత్యం ఆ స్వామిని పూజిస్తుంటారు ... అంకితభావంతో సేవిస్తుంటారు. ఇలా భక్తులతో నిత్యనీరాజనాలు అందుకునే వినాయకుడు వివిధముద్రలతో ... నామాలతో దర్శనమిస్తూ వుంటాడు.

ముఫ్ఫైరెండు వినాయక రూపాలు విశిష్టమైనవిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వాటిలో 'డుంఢి వినాయక' రూపం ఒకటిగా కనిపిస్తుంది. డుంఢి వినాయకుడి పేరు పూణె సమీపంలోగల 'పాలీక్షేత్రం' లో వినిపిస్తుంది. బల్లాలేశ్వర్ అనే బాలభక్తుడు ప్రతిష్ఠించిన వినాయకమూర్తి, డుంఢి వినాయకుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.

ఈ నామంతో .. ఈ రూపంతోగల వినాయకస్వామిని మాఘమాసంలో 'తిలచతుర్థి' రోజున పూజించాలని చెప్పబడుతోంది. మాఘశుద్ధ చతుర్థిని 'తిలచతుర్థి' అనీ ... 'కుందచతుర్థి' అని పిలుస్తుంటారు. ఈరోజున అత్యంత భక్తిశ్రద్ధలతో డుంఢి వినాయకుడిని పూజించి ... నువ్వులతో చేసిన లడ్డూలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున నువ్వులను దానంగా కూడా ఇవ్వాలి. ఈ రోజున డుంఢి వినాయకుడిని పూజించి .. ఉపవాసంతో కూడిన జాగరణ చేయడం వలన, సమస్త పాపాలు ... దోషాలు నశించి సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News