సంక్రాంతి రోజున స్నాన విశేషం

విశేషమైన రోజుల్లో తలస్నానం చేసి భగవంతుడిని ఆరాధించడం జరుగుతూ వుంటుంది. ఇక కొన్ని పర్వదినాల్లో తలస్నానమే ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఈ రోజుల్లో చేసే తలస్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.అలా స్నాన విశేషాన్ని కలిగిన పర్వదినాల్లో 'సంక్రాంతి' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.

సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఈ పుణ్యకాలంలో తలస్నానం తప్పనిసరిగా చేయాలని చెప్పబడుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి దైవారాధన చేయాలి. శ్రీమహావిష్ణువును ... పౌష్యలక్ష్మిగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. పితృదేవతలను కూడా పూజించవలసి వుంటుంది. ఈ రోజున ఎవరికి ఎలాంటి దానం చేసినా అది అనేక రెట్లు అధికమై ఆ పుణ్యఫలాలు ముందుజన్మలకి సిద్ధంగా ఉంటాయని అంటారు.

స్నాన విశేషాన్ని కలిగిన ఈ రోజున తలస్నానం చేయకపోతే, వివిధరకాల వ్యాధుల బారినపడటం జరుగుతుందనీ, దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది. అందువలన సంక్రాంతి పండుగ రోజున తలస్నానం ఒక నియమంగా చెప్పబడుతోంది ... ఈ నియామాన్ని ఆచరించడం వలన సకలశుభాలు చేకూరతాయని స్పష్టం చేయడం జరుగుతోంది.


More Bhakti News