మకర సంక్రాంతి రోజున ఇవి దానం చేయాలి

అనునిత్యం సాక్షాత్కరిస్తూ సకల చరాచర జగత్తులోని చీకట్లను సూర్యభగవానుడు తరిమేస్తుంటాడు. తన సహస్ర కిరణాలతో మానవాళికి వెలుగును ప్రసాదిస్తూ వాళ్లను పునీతులను చేస్తుంటాడు. ఆయన అనుగ్రహంతోనే సమస్త జీవరాశికి ఆహారం లభిస్తుంది. ఆయన స్పర్శచేతనే మానవాళికి ఆరోగ్యం వరంగా దక్కుతుంది.

సమస్త జీవరాశికి ప్రాణదాత కనుకనే సూర్యభగవానుడిని అనాదిగా ఆరాధ్య దైవంగా భావించి పూజిస్తున్నారు ... ప్రత్యక్ష నారాయణుడుగా సేవిస్తున్నారు. అలాంటి సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడాన్ని సంక్రమణమనీ ... సంక్రాంతియని పిలుస్తుంటారు. ఇలా ఒక సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తున్నా, వీటిలో 'మకర సంక్రాంతి' ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి.

ఈ రోజు నుంచి సూర్యభగవానుడి ఉత్తరాయణ యాత్ర ఆరంభమవుతుంది. దేవతలకు పగలుగా చెప్పబడుతోన్న ఉత్తరాయణ కాలం ... పుణ్యకాలమని అంటారు. మకర సంక్రాంతి రోజున చేయబడే స్నానం ... ధ్యానం ... దానం ... జపతపాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున శక్తిని బట్టి గోదానం ... సువర్ణ దానం ... వస్త్రదానంగానీ, ధాన్యం ... ఫలాలు ... కాయగూరలుగాని దానం చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News