నాగకన్యను వివాహమాడిన అర్జునుడు

అర్ధాంగిగా పాండవుల మనసెరిగి ద్రౌపది మసలుకుంటూ వుంటుంది. పాండవులలో ఎవరు ద్రౌపదితో ఏకాంతంగా వున్నా, మిగతావారు ఆ వైపుకి వెళ్లకూడదనే నియమం విధించుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, ఆ పాపానికి పరిహారంగా వారు భూప్రదక్షిణ చేసిరావలసి ఉంటుందని నియమంగా పెట్టుకుంటారు.

అయితే ఒకానొక సందర్భంలో గోబ్రాహ్మణ రక్షణార్థం అర్జునుడు తన ధనుర్భాణాల కోసం ద్రౌపది - ధర్మరాజు ఏకాంతంగా వున్న చోటుకి వెళతాడు. సాధుజీవులను రక్షించడానికే అయినా, నియమ ఉల్లంఘన జరిగింది కనుక అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరుతాడు. అలా వివిధ తీర్థాలను దర్శిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.

ఆ సమయంలోనే నాగకన్య అయిన 'ఉలూచి' ఆయనని చూసి మోహిస్తుంది. తన లోకానికి తీసుకువెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. అర్జునుడి శౌర్యపరాక్రమాలను గురించి విని వున్న నాగరాజు, ఆయన రాకపట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. తన కూతురైన ఉలూచి .. అర్జునుడిని ఆరాధిస్తోందని తెలిసి, ఆయనతో ఆమె వివాహాన్ని జరిపిస్తాడు. అలా ఉలూచి అర్జునుడి అర్థాంగిగా ఆయన జీవితంలోకి ప్రవేశిస్తుంది.


More Bhakti News