పంచాయతన పూజా నియమం

పూజా విధానాలలో 'పంచాయతన' పూజా విధానం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. పంచాయతన పూజా విధానంలో విష్ణుమూర్తి ... శివుడు ... దుర్గ ... గణపతి ... సూర్యభగవానుడి ఆరాధన కనిపిస్తుంది. అనునిత్యం పంచాయతన పూజచేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.

పంచాయతన పూజా విధానంలో కనిపించే దేవతామూర్తులు వేరువేరుగా పూజలందుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కన్నా పంచాయతన పూజా విధానంలో ఆ దేవతా మూర్తులను పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

విష్ణుమూర్తిని విశ్వసించేవారు తమకి తెలిసిన రీతిలో పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఇక శివయ్యను ఆరాధించేవారు తమకి అందుబాటులో ఉన్న పూజా ద్రవ్యాలను ఉపయోగిస్తూ అర్చిస్తుంటారు. అలాగే మిగతా దేవతామూర్తులను కూడా తమకి గల శాస్త్రపరిజ్ఞానాన్ని బట్టి పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పంచాయతన పూజా విధానం ప్రత్యేకతను కలిగినదిగా కనిపిస్తుంది.

ఈ పూజా విధానంలో అక్షింతలతో శ్రీమహావిష్ణువును ... మొగలి పూలతో పరమశివుడినీ ... గరికతో దుర్గాదేవిని ... తులసితో వినాయకుడిని పూజించకూడదనే నియమం చెప్పబడుతోంది. ఈ నియమాన్ని పాటిస్తూ చేసే పూజవలన మాత్రమే పరిపూర్ణమైన ఫలితం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News