గురుగ్రహ దోష ప్రభావం ఇలా తగ్గుతుంది

ప్రపంచాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని మలచుకోవడానికి విద్య ఎంతో అవసరం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బతుకును తీర్చిదిద్దుకోవడానికి విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ అంచెలంచలుగా విజయాలను సొంతం చేసుకుంటూ అభివృద్ధిని సాధించడంలో విద్య కీలకమైన పాత్రను పోషిస్తుంది.

విద్యను నమ్ముకున్నవాళ్లు బాగుపడటమే తప్ప, బాధపడటం ఎప్పటికీ జరగదు. విద్య అనేది తేజస్సును ... ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రత్యేకమైన స్థానాన్ని ప్రసాదిస్తూ కీర్తి ప్రతిష్ఠలను అందిస్తుంది. విద్య పట్ల ఆసక్తిని కలిగించి దాని ద్వారా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి కారణం గురు గ్రహమే.

జాతకంలో గురుగ్రహ దోషం కారణంగా ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు, నేర్చిన విద్య రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది. నేర్చిన విద్య ఏదైనా అది రాణించకపోతే జీవితం అగమ్యగోచరంగా మారిపోతుంది. ఫలితంగా అనేక ఇబ్బందులను ... అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే, గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి.

గురువు ప్రీతి చెందాలంటే పసుపురంగు వస్త్రాలు ... శనగలు ... బెల్లం ... ఆవునెయ్యి దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ విధంగా చేయడం వలన గురువు సంతృప్తి చెందుతాడనీ, ఫలితంగా దోష ప్రభావం తగ్గుతుందని స్పష్టం చేయడం జరుగుతోంది.


More Bhakti News