గరికపూలతో శివుడిని పూజిస్తే ఫలితం !

పరమశివుడి లీలావిన్యాసాలలో భాగంగా ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తూ ఉంటాయి. దేవతల సంకల్పం కారణంగా ... మహర్షుల అభ్యర్థనమేరకు స్వామి అనేక ప్రాంతాలలో స్వయంభువుగా ఆవిర్భవించడం జరిగింది. అందువలన స్వామి అడవుల్లోను ... కొండలపైన ... గుహల్లోనూ ... సొరంగమార్గాల్లోను ... జలపాతాల పాదభాగంలోనూ దర్శనమిస్తూ ఉంటాడు.

స్వామి దర్శనమే సమస్త పాపాలను కడిగేస్తుంది కనుక, ఎంత కష్టమైనా ఆయన సన్నిధికి భక్తులు చేరుకుంటూనే ఉంటారు. ఆ స్వామిని అభిషేకించి ఆయన అనుగ్రహాన్ని కోరుతుంటారు. సహజంగానే స్వామి అడవీ ప్రదేశాల్లో లభించే పూలతో పూజలందుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. వాటిలో ఒక్కోరకం పూలతో పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.

అలాగే స్వామిని 'గరికపూలు' తో కూడా పూజిస్తుంటారు. గరికపూలు కూడా సదాశివుడికి మహా ప్రీతికరమైనవిగా చెబుతుంటారు. గరికపూలతో స్వామిని అర్చించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది. కలకాలం నిలిచే సౌభాగ్యాన్ని ఇవ్వమనే స్త్రీలంతా ఎన్నో పూజలు .. వ్రతాలు చేస్తుంటారు. అలాంటి ఫలితం ఆదిదేవుడికి గరికపూలను సమర్పించడం వలన లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News