పీడకలలు రాకుండా ఉండాలంటే ?

కలలు కనడమనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కలలు కనడమంటే తెలియని వాళ్లుండరు. పీడకలలో ... మంచికలలో వస్తూనే ఉంటాయి. కల ఏదైనా మెలకువ వచ్చేంత వరకూ అది నిజమేనని అనిపిస్తుంది కనుక, దానికి సంబంధించిన హావభావాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు.

మంచి కల ఎంతటి అందమైన అనుభూతిని కలిగిస్తుందో, పీడకల అంతగా భయపెడుతుంది. పీడకల అనేది ఒకసారి వస్తేనే రెండో రోజు నిద్రపట్టదు. అలాంటిది నిద్రపట్టడమే ఆలస్యం కొంతమందికి పీడకలలు వస్తుంటాయి. దాంతో వాళ్లు చీకటిపడుతుందంటేనే ఆందోళన చెందుతుంటారు ... నిద్రకుపక్రమించడానికే భయపడుతుంటారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చుంటారు.

ఇంతగా భయపెడుతోన్న పీడకలలు రాకుండా ఉండాలంటే భగవంతుడి నామస్మరణ చేయడానికి మించిన మార్గం మరొకటి లేదని చెప్పబడుతోంది. నిద్రపోవడానికి కాస్త ముందు నుంచి ఇష్టదైవం యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అలా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండటం వలన ఆందోళన దూరమై మనసు తేలికపడుతుంది.

మనసులో ఎలాంటి ఆందోళన ... ఆలోచన లేకుండా చేయడం వలన హాయిగా నిద్రపడుతుంది. భగవంతుడి నామస్మరణ వలన కలిగిన అనుభూతిలో తేలిపోతూ ఉండటం వలన ఎలాంటి పీడకలలు రావు. అందువలన తరచూ పీడకలల కారణంగా ఇబ్బంది పడుతోన్నవాళ్లు, ఇలా నిద్రకిముందు ఇష్టదైవం యొక్క నామస్మరణ చేయడం వలన మంచిఫలితం కనిపిస్తుంది.


More Bhakti News