కార్తీకంలో పాటించవలసిన నియమాలు

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసంగా కార్తీకమాసం కనిపిస్తుంది. ఈ మాసంలో పాటించే నియమాలే భగవంతుడి అనుగ్రహం దక్కేలా చేస్తూవుంటాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నదీ స్నానం చేయాలి .. లేదంటే చన్నీటి స్నానం చేయాలి. అంతేగానీ వేడినీటి స్నానం చేయకూడదు.

అలాగే తలకి నూనె పట్టించకూడదనే విషయాన్ని మరచిపోకూడదు. ఈ మాసమంతా తులసీ దళాలతో శ్రీమహా విష్ణువును ... బిల్వ దళాలతో పరమశివుడిని ఆరాధించాలి. ప్రతిరోజు పూజా మందిరంలోను ... తులసికోట దగ్గర ... ఆలయంలోను దీపాలు వెలిగించాలి. సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళలో శివ కేశవులను పూజించి .. వారికి నైవేద్యంగా సమర్పించిన దానినే ప్రసాదంగా స్వీకరించాలి.

ఉసిరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి దాని కింద భోజనాలు చేయాలి. ఈ మాసమంతా ఉల్లి .. వెల్లుల్లి .. ఇంగువ .. చద్దన్నం .. గుమ్మడికాయ .. వంకాయ .. ముల్లంగి .. నువ్వులు ... మాంసం వంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనసుని శివకేశవులను సేవించడంపై ఉంచాలి. ఈ నియమాలను పాటించడం వలన హరిహరులు అనుగ్రహం ... అనంతమైన పుణ్యఫలప్రాప్తి కలుగుతుంది.


More Bhakti News