పాపాలను నశింపజేసే గోధూళి

ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేసేవిగా గంగ .. గోవు .. గాయిత్రి కనిపిస్తూ వుంటాయి. ఇవి పాపాలను నశింపజేసి విశేషమైన పుణ్యఫలాలను అందజేస్తూ వుంటాయి. గోవు విషయానికే వస్తే ఇది సకలదేవతా స్వరూపంగా ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. అలాంటి గోవును రక్షించడం వలన దేవతలందరి అనుగ్రహం లభిస్తుంది.

గోవు వున్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాంటి ప్రదేశంలో చేసే జపతపాలు త్వరగా సిద్ధిస్తాయి. గోవును పోషించడం వలన ... పూజించడం గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. గోవు పాద భాగాల్లో సమస్త తీర్థాలు ఉంటాయి. అందువలన 'గోధూళి' ఎంతో పవిత్రమైనదిగా చెప్పబడుతోంది.

గోవును పూజించడం వలన ఎంతటి పుణ్యం కలుగుతుందో ... గోధూళి తలపై పడటం వలన కూడా అంతే ఫలితం లభిస్తుంది. గంగలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు ఎలా కడిగివేయ బడతాయో, గోధూళి శిరస్సున ధరించడం వలన కూడా అదే విధంగా పాపాల ప్రక్షాళన జరుగుతుంది.

ఒకసారి శ్రీకృష్ణుడు శిరోభారంతో బాధపడుతూ ఉన్నాడట. ఆయనకి ఉపశమనం కలిగించడం కోసం ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్లు చేయసాగారు. అయినా కృష్ణుడి శిరోభారం తగ్గకపోవడంతో వాళ్లు అయోమయంలో పడతారు. అప్పుడు ఆయన కాస్తంత గోధూళి తెచ్చి తన నుదుటికి రాయమని చెబుతాడు. అలా చేయగానే ఆయన బాధ మటుమాయమవుతుంది. దీనిని బట్టి గోధూళి ఎంతటి విశేషమైనదో అర్థం చేసుకోవచ్చు.


More Bhakti News