ఇలాగైతే శనిదేవుడు అనుకూలిస్తాడట !

నవగ్రహాలకు సంబంధించిన దోషాలు ఆయా జాతకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. జాతకంలో ఒక్కో గ్రహం ప్రతికూలంగా వుండటం ఒక్కో విధమైన కష్ట నష్టాలు ఎదురవుతూ వుంటాయి. అందువలన వాటి బారి నుంచి బయటపడటానికి ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు.

మిగతా గ్రహాల సంగతి అటుంచితే, శని గ్రహ సంబంధమైన దోషాల బారినపడినవాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతూ వుంటారు. జాతకంలో శని ప్రతికూలంగా వుంటే ఆ జాతకుడిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఏ విధంగాను వాటిని ఎదుర్కునే వీలులేని పరిస్థితులు కల్పిస్తాయి. అందువలన సాధ్యమైనంత త్వరగా శనిదోషం తొలగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

శనీశ్వరుడిని శాంతింపజేయడానికి వివిధ రకాల దానాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి దానాలు చేయడం వల్లనే కాదు, మంచిమనసుతో తలపెట్టే వివిధ ధర్మకార్యాల వలన కూడా శని శాంతిస్తాడని చెప్పబడుతోంది. దేవాలయాలు నిర్మించడం ... వాటిని అభివృద్ధి చేయడం ... దైవసంబంధమైన కార్యాక్రమాల్లో పాల్గొనడం చేయాలి. అనాథలకు .. వృద్ధులకు ... నిరుపేదలకి చేతనైన సాయాన్ని అందించాలి.

ఇలా తమ స్తోమతకి తగినట్టుగా ఎన్ని విధాలుగా ఇతరులకి సేవ చేయగలరో అన్ని రకాలుగాను వాళ్లకి సహాయాన్ని అందించాలి. దైవకార్యాలకు తమ వంతు సహాయసహకారాలను అందిస్తూ వుండాలి. మంచిపనులు చేసుకుంటూ వెళుతూ ఉండటం వలన శనిదేవుడి మనసు కరుగుతుందట. అప్పుడు ఆయన నుంచి ప్రతికూలత తగ్గి అనుకూలత పెరుగుతుంది. ఫలితంగా శని సంబంధమైన దోషాలు తొలగిపోయి ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News