ఈ రోజున శివుడిని ఇలా పూజించాలి

కష్టాల ఊబిలో కూరుకుపోతున్నప్పుడు ... సమస్యల వలలో చిక్కుకుపోతున్నప్పుడు ఆర్తితో పిలవగానే పరమశివుడు పరిగెత్తుకు వస్తాడు. తన భక్తులు అడిగినది ఇచ్చేయాలి ... వాళ్ల అవసరాలను తీర్చేయాలనే విషయాన్ని గురించే తప్ప ఆదిదేవుడు ఇంకేమీ ఆలోచించడు అనడానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి.

అందుకే కొండకోనల్లో ... దండకారణ్యాల్లో ... గుహల్లో ఆయన ఎక్కడ ఆవిర్భవించినా భక్తులు ఆయనని వెతుక్కుంటూ వెళుతుంటారు. అనారోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఆ స్వామికి మనస్పూర్తిగా అభిషేకాలు నిర్వహించి ఆనందానుభూతులను పొందుతుంటారు. అలాంటి శివుడి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని విశిష్టమైన తిథుల్లో కొన్ని ప్రత్యేక పూజలు ... వ్రతాలు చెప్పబడ్డాయి.

అలాంటివాటిలో 'దూర్వాష్టమి వ్రతం' ఒకటిగా కనిపిస్తుంది. భాద్రపద శుద్ధ అష్టమిని 'దూర్వాష్టమి' అని అంటారు. పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన 'గరిక' మధ్యలో ఈ రోజున శివలింగాన్ని వుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సంతాన యోగం లేని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News