ఇవి దానం చేస్తే బుధుడు శాంతిస్తాడట !

మానవుల జీవితాలను నవగ్రహాలు ప్రభావితం చేస్తూ ఉంటాయని ప్రాచీనకాలంలోనే మహర్షులు ఈ లోకానికి తెలియజేశారు. ఆయా గ్రహాల ప్రభావం వల్లనే అనుకూల ... ప్రతికూల ఫలితాలను పొందడం జరుగుతూ వుంటుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ఆ గ్రహానికి సంబంధించిన శాంతిచేయిస్తూ వుంటారు.

ఈ విధంగా ఆ గ్రహాన్ని శాంతింపజేయడం వలన, ఆ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతోంది. బుధగ్రహం విషయాన్నే తీసుకుంటే, ఈయన మిథున రాశికీ ... కన్యారాశికి అధిపతిగా చెప్పబడుతున్నాడు. ఈ గ్రహానికి అధిదేవత విష్ణుమూర్తి కావడం వలన, ఈయన ఎక్కువగా మేలే చేస్తూ ఉంటాడని చెబుతుంటారు. తారాచంద్రుల కుమారుడైన బుధుడు ... సింహంపై సంచరిస్తూ వుంటాడు.

బుధగ్రహ సంబంధమైన దోషంతో బాధపడుతోన్నవాళ్లకి బుద్ధి మందగించడంతో పాటు కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈయనను శాంతింపజేయాలంటే 'పచ్చ'ను ధరించవలసి వుంటుంది. అంతే కాకుండా బంగారాన్నీ ... పగడాన్నీ ... వివిధ రకాల పండ్లను ... పెసలను ... నెయ్యిని బ్రాహ్మణులకు దానం చేయవలసి ఉంటుందని చెప్పబడుతోంది.


More Bhakti News